నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన నర్సింగ్ రావు చిన్నతనం నుంచే బొమ్మలు గీయడం అభిరుచిగా మార్చుకున్నాడు. పాఠశాల స్థాయిలో నిర్వహించే చిత్రలేఖన పోటీల్లో ప్రతిభను నిరూపించుకొని ఉపాధ్యాయులను అబ్బురపరిచేవాడు. చిత్రకళలో అద్భుతాలు సృష్టిస్తూనే చాలా మంది ప్రముఖుల ముఖ చిత్రాలను గీసి వారికి జ్ఞాపికగా ఇచ్చారు. చివరికి తన చిత్రకళను జీవన వృత్తిగా మార్చుకున్నాడు.
నర్సింగ్ రావు బొమ్మ గీస్తే... జీవం పోసినట్లే
ఆయన కుంచె నుంచి జాలువారే చిత్రాలు చూస్తుంటే మంత్రముగ్ధులు కావాల్సిందే. ఎవరైనా కన్నార్పకుండా చూడాల్సిందే. కంప్యూటర్ యుగంలోనూ చిత్రకళకు జీవం పోస్తూ తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన నర్సింగ్ రావు.
బొమ్మ గీయడంలో నర్సింగ్‌రావుది అందెవేసిన చేయ్యి
ఇవీ చూడండి: తెలంగాణ జలస్వప్నం..సాకారమాయే....!