నయీం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కోరారు. అంతేకాక సమాచార హక్కు చట్టం కింద ప్రత్యేక దర్యాప్తు బృందానికి సుపరిపాలన వేదిక దరఖాస్తు చేసింది. వారిచ్చిన సమాచారంలో నయీం కేసులో కొందరి రాజకీయ నేతలు, పోలీస్ అధికారుల పేర్లు బయటపడ్డాయి.
జాబితాలో 8మంది రాజకీయ నాయకులు
నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి నాగిరెడ్డి ఇచ్చిన సమాధానంలో 8 మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, భువనగిరి మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వలిగొండ మాజీ ఎంపీపీ నాగరాజు, భువనగిరి మాజీ ఎంపీపీ వెంకటేష్, భువనగిరి మాజీ సర్పంచ్ పింగళరెడ్డి, అబ్దుల్ నాజర్, బొల్లి ఈశ్వరయ్య, వి. సంజీవ పేర్లు బయటికి వచ్చాయి.