రాష్ట్రంలోని 33 జిల్లాలు 17 పార్లమెంటు, వంద అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి శివరాత్రినాడు యాత్రను ప్రారంభించాడు.
మళ్లీ మోదీనే రావాలంటూ సైకిల్ యాత్ర - yadadri bhuvanagiri
రాజకీయ నేతలు అధికారం కోసం పాదయాత్రలు చేయడం చూసుంటాం.. బస్సు యాత్రలు చేయడం చూసుంటాం.. కాని తెలంగాణలో ఓ వ్యక్తి తన అభిమాన నేత నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని రాష్ట్రమంతా సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.

మోదీనే ప్రధాని కావాలని కోరుతూ సైకిల్ యాత్ర
మోదీనే ప్రధాని కావాలని కోరుతూ సైకిల్ యాత్ర
ఇప్పటి వరకు 17 జిల్లాలు చుట్టొచ్చి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ చేరుకున్న ఆయనకు స్థానిక భాజపా కార్యకర్తలు స్వాగతం పలికారు. రాష్ట్రంలో భాజపాను 17 పార్లమెంటు స్థానాల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇదీ చదవండి:మిర్యాలగూడ కేసీఆర్ సభలో కార్యకర్తల జోష్
Last Updated : Mar 31, 2019, 12:37 PM IST