తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎక్స్​అఫిషియో ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్​పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్​ ఎక్స్​అఫిషియో ఓటు ద్వారా తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

mp komati reddy fire on cm kcr in yadadri bhuvanagiri
'ఎక్స్​అఫిషియో ఓట్లతో సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు'

By

Published : Jan 27, 2020, 3:21 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పూర్తి మెజార్టీతో గెలిసిన కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిని తప్పించి ఎక్స్​అఫిషియో ఓట్లతో సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి సాక్షిగా సామ్యవాదాన్ని భ్రష్టుపట్టిస్తూ వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరిని ఎక్స్ అఫిషియో ఓటు వేయించడం సిగ్గుచేటని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు ఇన్ని సార్లు వచ్చిన కూడా ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. తాము స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే అధికార పార్టీ వారిని భయబ్రాంతులకు గురి చేసి తమవైపు మళ్లించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

'ఎక్స్​అఫిషియో ఓట్లతో సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు'

ఇవీ చూడండి: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు... ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

ABOUT THE AUTHOR

...view details