ETV Bharat / state

నేరేడుచర్లలో కేవీపీకి ఓటు... ఛైర్మన్​ ఎన్నిక వాయిదా - undefined

kvp-ramchandra-rao-got-vote-in-municipal-chairperson
కేవీపి రామచంద్రరావు
author img

By

Published : Jan 27, 2020, 11:29 AM IST

Updated : Jan 27, 2020, 12:30 PM IST

11:28 January 27

నేరేడుచర్లలో కేవీపీ ఓటేయవచ్చు.. ఎస్​ఈసీ గ్రీన్​ సిగ్నల్​

     నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు ఎక్స్‌అఫీషియో ఓటుహక్కు లభించింది. ఓటు వేసేందుకు కేవీపీకి ఎస్ఈసీ అనుమతి ఇచ్చింది. తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికైన కేవీపీ.. నేరెడుచర్ల మున్సిపాలిటీలో ఓటు వేసేందుకు దరఖాస్తు చేశారు. అధికారులు దానిని తిరస్కరించగా...  రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్​కు ఆధారాలతో కేవీపీ లేఖ రాశారు.

             దానిపై ఇంకా నిర్ణయం వెలువడనందున.. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి వివరించారు. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కేవీపీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. కేవీపీ ఓటు రద్దు చేస్తూ నేరెడుచర్ల కమిషనర్​ ఇచ్చిన ఆదేశాలను ఎస్​ఈసీ రద్దు చేసింది. 

            ఈ నిర్ణయంతో నేరేడుచర్లలో సభ్యుల ప్రమాణస్వీకారం మధ్యాహ్నం 3 గంటలకు  వాయిదాపడింది. సాయంత్రం 4 గంటలకు ఛైర్మన్​ ఎన్నిక జరగనుంది. 

Last Updated : Jan 27, 2020, 12:30 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.