తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి మరణవార్త తట్టుకోలేక.. కొడుకు మృతి

అతనికి అమ్మ అంటే ప్రాణం. నవమాసాలు మోసి పెద్ద చేసిన ఆ తల్లి మృతి చెందింది. మరణవార్త విన్న కొడుకు గుండె చెరువైంది. మాతృమూర్తి మరణం తట్టుకోలేక ఆ హృదయం ఆగిపోయింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది.

తల్లి మరణవార్త తట్టుకోలేక.. కొడుకు మృతి

By

Published : Mar 19, 2019, 12:22 PM IST

తల్లి మరణవార్త తట్టుకోలేక.. కొడుకు మృతి
భూదాన్ పోచంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు తల్లి కొడుకులు మృతిచెందారు. చర్లపల్లి లలిత 72 సంవత్సరాల వృద్ధురాలు నిన్న రాత్రి బాత్రూమ్​కు వెళ్లిన సమయంలో షుగర్ ఎక్కువైంది. ఇంట్లో వారు గమనించలేదు. ఆ వృద్ధురాలు కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది.

హైదరాబాద్​లో ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తున్న కొడుకు సుందర్ తల్లి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. తల్లి పాదాల వద్ద పడి రోదించాడు. అదే సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. బంధువులు వైద్యం కోసం హైదరాబాద్​కు తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందగా...కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details