యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. దాతల సాయంతో వచ్చిన 2 లక్షల 40 వేల రూపాయలతో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు పక్కన వ్యవసాయ స్థలంలో టేకు మొక్కలు నాటారు. దాతలు స్వచ్ఛందగా ముందుకు వచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల నేరాలను, అల్లర్లను అదుపు చేయొచ్చని తెలిపారు.
దాతల సాయంతో సీసీ కెమెరాల ఏర్పాటు
దాతల ఆర్థిక సాయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మహబూబ్‌పేటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత వీటని ప్రారంభించారు.
దాతల సాయంతో సీసీ కెమెరాల ఏర్పాటు