యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలోని తహశీల్దా కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. మండల పరిధిలోని చాడ, చామాపూర్, మోటకొండూర్, చందేపల్లి, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వల్ల ఎంతో మంది పేదలు లాభపడ్డారన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న ఆలోచనతో కేసీఆర్ ఈ పథకం రూపొందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంచిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత! - షాదీ ముబారక్ పథకం
యాదాద్రి భువనగిరి జిల్లాలో లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారంగా మారకూడదన్న కేసీఆర్ ఆలోచన ఫలితమే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలని గుర్తు చేశారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు నడిపిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంచిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత!