తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రీడాకారులకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే - Telangana news today

అంతర్జాతీయ క్రీడాకారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్(MLA Gadari Kishore Kumar) అండగా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులకు తన వంతుగా సాయంగా ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున అందజేశారు.

MLA gadari kishore
క్రీడాకారులకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

By

Published : Jun 5, 2021, 3:31 PM IST

ఉత్తమ క్రీడాకారులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్(MLA Gadari Kishore Kumar) ప్రోత్సహించారు. తన వంతు సాయంగా ఒక్కో క్రీడాకారునికి రూ.10 వేల చొప్పున మొత్తం ముగ్గురికి ఆర్థిక సహాయం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన ఈదుల సాయి ప్రశాంత్, మోత్కూర్ మండలం పాలడుగుకి చెందిన కొంపెల్లి నవీన్, దాచారం గ్రామానికి చెందిన సురారం నవీన్… నేపాల్​లో నిర్వహించనున్నఅంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.

కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించి రాష్ట్రానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పొన్నబోయిన రమేశ్​, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details