యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రీశుని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం మహిళల భద్రత-షీ టీమ్స్‌పై రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఎమ్మెల్యే సునీతతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరికీ సాధ్యంకాని పనులను సుసాధ్యం చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు.