తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి నిరంజన్‌రెడ్డికి నిరసన సెగ.. అడ్డుకున్న బీజేవైఎం నేతలు - bjym leaders obstructed minister niranjan reddy

Minister Niranjan Reddy Yadadri Tour: యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నిరంజన్​ రెడ్డికి నిరసన సెగ తగిలింది. రైతు బంధు వారోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రిని బీజేవైఎం నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత యాదాద్రీశుని దర్శనానంతరం కొండపై ఆయనను వ్యాపారులు అడ్డుకున్నారు.

minister niranjan reddy latest news
యాదాద్రిలో నిరంజన్​ రెడ్డి

By

Published : Jan 7, 2022, 3:58 PM IST

Minister Niranjan Reddy Yadadri Tour: యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెంలో రైతు బంధు వారోత్సవాల్లో పాల్గొన్నేందుకు వెళ్లిన మంత్రిని బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముత్తిరెడ్డి గూడెం రైల్వే గేటు నుంచి ట్రాక్టర్ నడుపుకుంటూ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మంత్రి వెంట వెళ్తున్న తెరాస నాయకులు, కార్యకర్తలు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

స్వామి వారి దర్శనం

అనంతరం యాదాద్రీశుడిని మంత్రి నిరంజన్​ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి చెందేలా సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. బస్వాపురం రిజర్వాయర్​ ద్వారా కాళేశ్వరం నీళ్లతో లక్ష్మీ నరసింహ స్వామి పాదాలను పునీతం చేయనున్నారని వెల్లడించారు.

స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్న మంత్రి నిరంజన్​ రెడ్డి

దుకాణదారుల అడ్డగింత

స్వామివారి దర్శనం తర్వాత తిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్ రెడ్డిని దుకాణదారులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు వ్యాపారులకు తిరిగి కొండపైనే షాపులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు దుకాణదారుల రిలే నిరాహార దీక్ష నేటితో 10వ రోజుకు చేరుకుంది.

యాదాద్రిలో నిరంజన్​ రెడ్డి

ఇదీ చదవండి:'ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజం.. ఇలా చేస్తారని అనుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details