యాదగిరిగుట్ట గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారు: కేటీఆర్ Minister KTR Road Show at Yadagirigutta :55 ఏళ్లలో సాధ్యం కానిది బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తొమ్మిదిన్నరేళ్లలోనే చేసి చూపించిందని ఆ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. రాబందుల లెక్క రైతులను పీక్కుతినేవాళ్లు మనకు అవసరమా..? అని ప్రజలను అయన ప్రశ్నించారు. యాదగిరిగుట్టలోని కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యాదాద్రి గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారని కొనియాడారు.
BRS Election Campaign in Yadagirigutta :డిసెంబర్ 3వ తేదీన గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సభ గొంగిడి సునీత గెలుపు విజయోత్సవ సభను తలపిస్తోందని చెప్పారు. 2014 యాదగిరిగుట్ట ఎలా ఉన్నదో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. యాదగిరిగుట్ట అభివృద్ధితో కొందరికి అన్యాయం జరిగిందన్నారు. కొండపైకి ఆటోలు వెళ్లేలా ఆటో డ్రైవర్లకు డిసెంబర్ 3వ తేదీ తర్వాత శుభవార్త చెప్తామని వెల్లడించారు. కాంగ్రెస్ సమయంలో రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతుండేవాళ్లుని ఆరోపించారు.
నేను రష్మిక అంత ఫేమస్ కాదు - డీప్ ఫేక్ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్
KTR Fires on Congress Leaders :రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి ఆలేరులో ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకోండని.. 24 గంటల కరెంటు వస్తుందో లేదో తెలుస్తోందని మంత్రి సవాల్ విసిరారు. కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదని.. ఉత్తిత్తి కరెంటు అని విమర్శించారు. వరిధాన్యం పండించడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్ వన్ అని పేర్కొన్నారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారని.. ఎందుకియ్యాలి కాంగ్రెస్‌కు ఒక్కఛాన్స్..? అని ప్రశ్నించారు. తాగు, సాగునీటి కష్టాలు పోయినయాని తెలిపారు. కరోనాతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చిందన్నారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు వస్తాయని తెలిపారు. అలాగే 4 కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ చేస్తామంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంగిడి సునీతను గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురంను మండలాలుగా చేస్తామని హామీనిచ్చారు.
యాదిగిరిగుట్టలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు :
- 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల కోసం సౌభాగ్యలక్ష్మీ
- ఆసరా పింఛన్లను రూ.5 వేలు చేయబోతున్నాం
- వంటగ్యాస్ సిలిండర్ ను రూ.400 కే ఇస్తాం
- తెల్లరేషన్ కార్డులు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం
- భూమి లేనోళ్లకు కూడా రూ.5 లక్షల కేసీఆర్ భీమా ఇస్తాం
- అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తాం
- సమ్మక్క సారక్క పేర్లపై మహిళా సంఘాలు
- ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తాం
- కొండపైకి ఆటోలను అనుమతిస్తాం
- దాతరుపల్లి వద్ద టూరిజం పార్క్ ఏర్పాటు చేస్తాం
- ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకువస్తాం
'యాదాద్రి కంటే గొప్పగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తాం'
కేసీఆర్ ధరణి కావాలా? కాంగ్రెస్ పట్వారీ వ్యవస్థ కావాలా? : కేటీఆర్