యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది.
చాలా రోజుల తర్వాత యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత ఆలయంలో సందడి నెలకొంది. మరో వైపు భక్తులు పలుచోట్లు భౌతిక దూరం పాటించడం లేదు.
కరోనా కాలంలో కూడా ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి కనిపించింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతించారు. ఆలయ అధికారులు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
కొవిడ్ నిబంధనల కారణంగా కేవలం భక్తులను స్వామి వారి దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో ఆర్జిత సేవలను నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్నపటికి ఆలయంలోకి వెళ్లే క్యూలైన్, ప్రసాదాల విక్రయ శాల వద్ద పలువురు భక్తులు భౌతిక దూరం పాటించడం లేదు.
TAGGED:
Heavy rushin yadadri temple