గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మామిడి తోటల రైతులకు నష్టం కలిగింది. ఈదురు గాలులకు మామిడి పిందెలు, కాయలు నేలరాలాయి. ఇప్పటికే పంట అంతంత మాత్రంగా ఉన్న మామిడి రైతులకు వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
వడగళ్ల వానతో మామిడి రైతులకు తీవ్ర నష్టం - యాదాద్రి జిల్లా మామిడి రైతులకు తీవ్ర నష్టం
వడగళ్ల వర్షానికి యాదాద్రి జిల్లాలో మామిడి రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 12 వేల 980 ఎకరాల్లో సాగు చేసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
అకాల వడగళ్ల వానతో మామిడి రైతులకు తీవ్ర నష్టం
జిల్లా వ్యాప్తంగా 12, 980 ఎకరాల్లో మామిడి రైతులు సాగు చేస్తున్నారు. మామిడి తోటలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులకు మరింత నష్టం సంభవించింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.