తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు బడిని బతికించాలనే సంకల్పం - SCHOOL]

ప్రభుత్వ పాఠశాలను బతికించుకునేందుకు ఆ ఊరి యువత అంతా ఒక్కటైంది. బడిని బాగు చేసి ఉచితంగా పుస్తకాలు, బెల్టు, టై, షూ పంపిణీ చేస్తున్నారు. సర్కారు బడిలో ఉండే సదుపాయాల గురించి విద్యార్థుల తల్లిదండ్రలకు వివరిస్తున్నారు.

సర్కారు బడిని బతికించాలనే సంకల్పం

By

Published : Jun 16, 2019, 3:24 PM IST

Updated : Jun 16, 2019, 4:43 PM IST

సర్కారు బడిని బతికించాలనే సంకల్పం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలో 'మన ఊరు మన బడి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బడిలో పిల్లల శాతం తక్కువగా ఉన్నందున ప్రభుత్వం పాఠశాలను మూసివేసేయాలని చూస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో పాఠశాలను బతికించుకోవాలని ఆ ఊరి యువత శ్రమదానం చేసి బడిని పరిశుభ్రంగా తయారు చేశారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ బడి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సదుపాయాల గురించి మధ్యాహ్న భోజనం పథకం గురించి వివరిస్తున్నారు. ప్రైవేటు బడికిలోకంటే నాణ్యమైన విద్యను అదీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారంటూ తల్లిదండ్రులకు వివరించారు. అవసరమైతే తామే విద్యావాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. గ్రామంలోని పెద్దల ఆర్థిక సాయంతో విద్యార్థులకు బెల్టు, టై, షూ, నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

Last Updated : Jun 16, 2019, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details