తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో ఉద్ఘాటన దిశగా శివాలయం.. 25న మహాకుంభాభిషేకం - ramalingeshwara swamy temple in yadadri on 25th april

ఉద్ఘాటన దిశగా యాదాద్రి శివాలయంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. యాదాద్రి అనుబంధ ఆలయం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25న మహాకుంభాభిషేకం జరగనుంది. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో యాగశాల నిర్మాణం చేపట్టారు.

yadadri shivalayam
యాదాద్రిలో శివాలయ ఉద్ఘాటన

By

Published : Apr 15, 2022, 1:13 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనుబంధ శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహా కుంబాభిషేకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగే వేడుకలో భాగంగా ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో యాగశాల నిర్మాణం చేపట్టారు. పరిసరాలను శుభ్రపరిచారు. స్మార్త ఆగమ సంప్రదాయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

శివాలయ మహా కుంభాషేకానికి ఏర్పాట్లు
యాదాద్రిలో ప్రధాన ఆలయానికి అనుబంధంగా శైవాగమ విధానాలతో నిర్మి తమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సలహాతో శివాలయం ఉద్ఘాటనకు సంబంధించి ఈ నెల 20న అంకుర్పారణ, 21న యాగశాల ప్రవేశం, 23న మహాలింగార్చనం, ధాన్యాధివాసం, 24న శతరుద్రాభిషేకం, పుష్పాధివాసం నిర్వహిస్తున్నారు. 25న (సోమవారం) ఉదయం 10.25 గంటలకు ధనిష్ఠా నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశ సముహూర్తమున మహాకుంభాభిషేక మహోత్సవం ఉంటుంది. అదే రోజు సాయంత్రం నుంచి దైవదర్శనాలు మొదలవుతాయి.
అద్భుత శిల్పకళా నైపుణ్యం

అద్భుతం.. శివాలయం:2017 జూన్​లో శివాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గర్భాలయం, విమానం, మహామండపం, నంది, బలిపీఠం, పార్వతీదేవి మందిరాన్ని కృష్ణశిలతో అద్భుతంగా రూపొందించారు. మహానంది ప్రధానాకర్షణగా నిలువనుంది. యాదాద్రి నారసింహుని సన్నిధి పునర్నిర్మాణం పూర్తి కాగా.. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పునర్నిర్మితమైన ఆలయ శోభను చూసి తన్మయత్వం చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details