ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రీశుని అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 28న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి.
పాతగుట్టలో కన్నులపండువగా బ్రహ్మోత్సవాలు..
పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు.. ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి.
పాతగుట్టలో బ్రహ్మోత్సవాలు
రెండోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ పూజలు కన్నులపండువగా నిర్వహించారు. రాగతాళ ధ్వనులతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి. ఆలయ అర్చకులు ధ్వజపటంపై గరుడునికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. గరుడ ముద్దలను భక్తులకు అందజేశారు. 24న ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం