సీఎం కేసీఆర్ జన్మదినాన.. మోత్కూర్ గ్రంథాలయానికి రిటైర్డ్ ఐసీఆర్ చీఫ్ కె.సురేందర్ రావు, కంప్యూటర్ను బహుకరించడం అభినందనీయమని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విద్యావంతులు.. సురేందర్‌ను ఆదర్శంగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
మోత్కూర్ లైబ్రరీ.. అభివృద్ధి పథంలో నడుస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు రామకృష్ణారెడ్డి. గ్రంథాలయ కమిటీని అభినందించారు.