తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ పంచరూప లక్ష్మీనరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి గుడిలో అధ్యయణోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. చివరి రోజైన నేడు స్వామి వారికి వివిధ పూజలు నిర్వహించి.. ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. శ్రీలక్ష్మీ సమేత నరసింహుడు సేవపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో రేపటినుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అధ్యయణోత్సవాలు ఘనంగా ముగిశాయి. రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో రేపటినుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 4 నుంచి 10 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనుండగా.. 6న ఎదురుకోళ్లు,7న కల్యాణం, 8వ తేదీన రథోత్సవం, 9న పూర్ణహుతి, చక్ర తీర్థం కార్యక్రమంలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:గాంధీలో కరోన నిర్ధారణ పరీక్షలు.. కొన్నిగంటల్లోనే ఫలితం