తెలంగాణ

telangana

ETV Bharat / state

వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి జయంతి వేడుకలు వైభవంగా సాగాయి. కృష్ణ పరమాత్ముడి, విశ్వక్సేన ఆరాధన, హోమం జలపూజ, స్వస్తివాచనం, రక్షా బంధనం, శ్రీకృష్ణ ఆవాహనం, సహస్ర నామార్చనలతో యాదాద్రి పంచ నారసింహుల సన్నిధిలో శ్రీ కృష్ణ జయంతి పర్వాలకు గురువారం సాయంత్రం ఆది పూజలను చేపట్టారు.

వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

By

Published : Sep 11, 2020, 5:00 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి జయంతి వేడుకలు వైభవంగా సాగాయి. ప్రధాన పూజారి నేతృత్వంలో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. వైష్ణవ ఆచారంలో తొలి పూజను సంప్రదాయంగా నిర్వహించారు. కృష్ణపరమాత్ముడి గురించి వివరిస్తూ సహస్ర నామాలతో కొలిచారు. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడికి ఆవుపాలను నివేదించారు.

యాదాద్రి బాలాలయ మండపంలో.. కృష్ణ పరమాత్ముడి, విశ్వక్సేన ఆరాధన, హోమం జలపూజ, స్వస్తివాచనం, రక్షా బంధనం, శ్రీకృష్ణ ఆవాహనం, సహస్ర నామార్చనలతో యాదాద్రి పంచ నారసింహుల సన్నిధిలో శ్రీ కృష్ణ జయంతి పర్వాలకు గురువారం సాయంత్రం ఆది పూజలను చేపట్టారు. ఏటేటా కృష్ణాష్టమి వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. శనివారం ఊట్లను కొట్టే క్రీడను చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:భద్రాద్రిలో ఘనంగా కృష్ణాష్టమి ఉత్సవాలు.. రేపు ఉట్టి కొట్టే వేడుక

ABOUT THE AUTHOR

...view details