తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: వివేక్​ - vivek

యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ తన బొమ్మతో సహా తెరాస గుర్తును కూడా చెక్కించుకోవడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు భాజపా నేత వివేక్ వెంకటస్వామి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ స్తంభాలను పరిశీలించారు.

స్తంభాలు పరిశీలిస్తున్న వివేక్​

By

Published : Sep 9, 2019, 11:29 AM IST

యాదాద్రి ఆలయ స్తంభాలపై చెక్కిన బొమ్మలను తొలగిస్తే సరిపోదని, ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భాజపా నేత వివేక్ డిమాండ్​ చేశారు. ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం స్తంభాలపై వివాదాస్పద చెక్కడాలను పరిశీలించారు. కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు.

కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: వివేక్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details