వచ్చే రెండు మూడు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భువనగిరి బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్...ప్రాజెక్టు పూర్తయితే... కాల్వలన్నీ ఏడాదిలో 9 నుంచి పది నెలల పాటు నిండు గర్భిణీలాగా నీళ్లతో కళకళలాడుతాయన్నారు. యాదాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాలు పచ్చగా మారుతాయని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని రిజర్వాయర్లను తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.
"నిండు గర్భిణీలెక్క కాల్వలు కళకళలాడుతయి" - KCR IN BUVANAGIRI MEETING
రాష్ట్రంలో 16 లోక్సభ స్థానాల గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ ప్రచారం సాగిస్తున్నారు. భారీ బహిరంగ సభలతో ప్రజలను తమవైపుకు తిప్పుకుంటున్నారు. భువనగిరిలో నిర్వహించిన సభలో... తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు ఎంపీల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు కేసీఆర్.
భువనగిరి బహిరంగ సభలో
TAGGED:
KCR IN BUVANAGIRI MEETING