పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారము సెలవు కావడంతో ముందురోజు నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి... ఉదయాన్నే కార్తిక దీపాలు వెలిగించి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి బాలాలయంలో సువర్ణ మూర్తుల దర్శనానికి బారులు తీరారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శివకేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసంలో వేలాది మంది భక్తులు నరసింహుని సన్నిధికి వచ్చి... సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు. కార్తిక మాసం పవిత్రమైనదని... అన్నవరం తర్వాత అధిక సంఖ్యలో వ్రతాలు యాదాద్రిలోనే జరుగుతాయని అర్చకులు తెలిపారు.