ఆ బావిలోనే కల్పన మృతదేహం ఉంటుందా ? - HAJIPUR
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న శ్రావణి, నిన్న మనీషా, నేడు కల్పన... వీరందరినీ పొట్టనపెట్టుకున్నాడో మానవమృగం. బావిని మరింత లోతుగా తవ్వాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశాలతో... అక్కడికి కల్పన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా కల్పన మృతదేహం బయటపడుతుందేమోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అదే బావిలోనే కల్పన ఉంటుందా?
హాజీపూర్‌లో నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన 11ఏళ్ల కల్పన మృతదేహం ఇప్పుడు ఇదే బావిలో ఉంటుందేమోనని కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. వేసవి సెలవుల్లో మేనత్త ఇంటికి వెళ్ళిన కల్పన మళ్లీ తిరిగి ఇంటికిరాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. శ్రావణి, మనీషా మృతదేహాలు దొరికిన బావిలోనే కల్పన తాలూకు ఆనవాళ్లు ఉంటాయేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బావి దగ్గరకు చేరుకున్న కల్పన కుటుంబసభ్యులతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖామఖి.
Last Updated : Apr 30, 2019, 3:25 PM IST