తెలంగాణ

telangana

ETV Bharat / state

accident: భార్య కళ్ల ముందే భర్త మృతి - accident

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తవారింటికి వెళ్లి భార్య, పాపతో తిరిగి వస్తున్న క్రమంలో వేగంగా వచ్చిన లారీ బైక్​ను ఢీ(accident) కొట్టింది. ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య కళ్ల ముందే భర్త మరణించడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది.

husband died before wife
accident: భార్య కళ్ల ముందే భర్త మృతి

By

Published : Jun 9, 2021, 7:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్​ రోడ్డు వధ్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి(accident) చెందాడు. గుండాల మండల కేంద్రం పాచిల్ల గ్రామానికి చెందిన పందుల భిక్షం(25)తన అత్తగారి గ్రామమైన జానకిపురంకు వెళ్లాడు.

తిరిగి భార్య, మూడు నెలల కుమార్తెతో వస్తున్న క్రమంలో… పాటిమట్ల క్రాస్​ రోడ్డు వద్ద బైక్​లో పెట్రోల్ కోసం భార్యను దింపాడు. ఆ క్రమంలోనే రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ అతనిని ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. భార్య కళ్ల ముందే భర్త మృతి చెందడంతో ఆమె రోదనకు అంతులేకుండా పోయింది.

ఇదీ చూడండి:Fight: పోలీస్​ స్టేషన్​ ముందే దాడి చేసుకున్న బంధువులు

ABOUT THE AUTHOR

...view details