యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం... 21 రోజుల హుండీ ఆదాయం 89 లక్షల 95 వేల 568 రూపాయలుగా అధికారులు లెక్కించారు. కొండపైన గల హరిత హోటల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. 188 గ్రాముల మిశ్రమ బంగారం... 3కిలోల మిశ్రమ వెండి.. భక్తులు కానుకలుగా సమర్పించారు. ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో... లెక్కింపు జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బంది.. లెక్కింపులో పాల్గొన్నారు.
మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీసమేత నారసింహస్వామి నిజరూప దర్శనానికి ముహూర్తం దగ్గర్లో ఉన్నందున... పునర్నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి (reconstruction work of the fast progressing). తుది దశ పనులను వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తి చేసేందుకు యాడా దృష్టిసారించింది. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి... ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్తర, తూర్పు దిశల్లో 40 కోట్ల వ్యయంతో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కైంకర్యాల కోసం విష్ణుపుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోగా పుష్కరిణి పనులు సంపూర్తి కానున్నాయి. ఆంజనేయస్వామి మందిరానికి దారి నిర్మితమవుతోంది. గండిచెరువు ప్రాంతంలో దీక్షాపరుల మండలం పూర్తయింది. కల్యాణ కట్ట పనులు 5 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయి. లక్ష్మీ పుష్కరిణికి సంబంధించి తుది దశ నిర్మాణం జరుగుతోంది. కొండపైన బస్ బే పనులు చకచకా సాగుతుండగా... కొండ కింద పనులు మొదలు కావాల్సి ఉంది.
తుదిదశ పనులు పూర్తి చేసేలా...