ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి హుండీల్లోని నగదు లెక్కింపును ఆలయ అధికారులు ఈ రోజు చేపట్టారు. స్వామి వారికి 23 రోజుల్లో హుండీల ద్వారా రూ. 29లక్షల 78వేల 464 నగదు, 9 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 1కిలో 100 గ్రాముల మిశ్రమ వెండి ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఈవో గీతా రెడ్డి తెలిపారు.
కరోనాతో యాదాద్రీశునికి తగ్గిన హుండీ ఆదాయం - hundi counting in yadadri temple
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆలయ అధికారులు ఈ రోజు హుండీ నగదు లెక్కించారు. 23 రోజుల్లో స్వామి వారికి రూ. 29 లక్షల 78, 464 కానుకలు రాగా, బంగారు, వెండి ఆభరణాలు అతితక్కువగా వచ్చాయి. కరోనా కారణంగా హుండీ ఆదాయం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
యాదాద్రి హుండీ లెక్కింపు
సిబ్బంది మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఆదాయం లెక్కించారు. ఆలయంలో కొవిడ్ నిబంధనల ప్రకారం పూజలు, దైవ దర్శనాలు కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా భక్తుల రాక గణనీయంగా తగ్గింది. ఆర్జిత సేవలో భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి:హైకోర్టు వ్యాఖ్యలు సర్కార్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి