ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. కొండపై గల హరితభవనంలో ఆలయ ఆధికారులు, ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో 22 రోజుల ఆదాయాన్ని లెక్కించారు. రూ.1,20,27,394ల నగదు, 310 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి, దేవస్థానం అధికారులు తెలిపారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ హుండీ లెక్కింపు చేపట్టారు.
YADADRI TEMPLE: 22 రోజుల్లో యాదాద్రీశుని ఆదాయం ఎంతంటే..?
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 22 రోజుల్లో రూ.1,20,27,394ల నగదు, 310 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
YADADRI TEMPLE: 22 రోజుల్లో యాదాద్రీశుని ఆదాయం ఎంతంటే..?
శ్రావణ మాసంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఆర్జిత సేవల్లో నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతాలు, తల నీలాలు, సత్యనారాయణ స్వామి వ్రతపూజలు మొదలగు వాటిలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: TS SCHOOL ATTENDANCE: రెండో రోజు పాఠశాలలకు విద్యార్థుల హాజరు అంతంతే..