యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్లను హెచ్ఎండీఏ అధికారులు తొలగించారు. చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధి సర్వేనెంబర్ 212లో ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్కా పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్‌ని తొలగించారు. జేసీబీ సాయంతో హద్దు రాళ్లను, రోడ్లను పడగొట్టారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని వినాయక ఫేజ్ 2, జేవీ హోమ్స్‌లోని 9. 9 ఎకరాల్లో ఏర్పాటుచేసిన వెంచర్లను అక్రమమైనవిగా గుర్తించి ధ్వంసం చేశారు. అనుమతులు లేని వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
యాదాద్రిలో వెలసిన అక్రమ వెంచర్ల తొలగింపు - VENTURES
యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను హెచ్ఎండీఏ అధికారులు తొలగించారు. అనుమతులు లేని ప్రాంతాల్లో ప్రజలు స్థలాలు కొనరాదని సూచించారు.
యాదాద్రి జిల్లాలో అక్రమ వెంచర్ల తొలగింపు