'ఇది యావత్ తెలంగాణకు దక్కిన గౌరవం' - హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా తనను నియమించడం యావత్ తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని భాజపా నేత బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'ఇది యావత్ తెలంగాణకు దక్కిన గౌరవం'
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనను హిమాచల్ గవర్నర్‌గా నియమించడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని దత్తాత్రేయ అన్నారు. హిమాచల్ గొప్ప దేవభూమి అని, తెలంగాణ వీరభూమిగా పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : ఇది నా జీవితంలో నూతన అధ్యాయం: దత్తాత్రేయ