తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు - పవిత్రోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని సన్నిధిలో రెండో రోజు పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా స్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు

By

Published : Aug 11, 2019, 5:26 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి నవ కళాశాభిషేకం, లఘు పూర్ణాహుతి, ప్రబంధ పారాయణ నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా నేడు, రేపు స్వామి వారి కల్యాణాలు, సుదర్శన హోమాలు రద్దు చేశారు. ఈ నెల 13 నుంచి అర్జిత సేవలను పునరుద్ధరించనున్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకోని నారసింహునికి లక్షపుష్పార్చన నిర్వహించారు.

ఆదివారం కావడం వల్ల స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. సత్యనారాయణ మండలం, కల్యాణకట్ట, పుష్కరిణి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు

ఇవీ చూడండి: 108 చీరలతో ఏడుపాయల అమ్మవారికి అలంకరణ

ABOUT THE AUTHOR

...view details