యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో చేనేత కార్మికుల చేస్తున్న రిలే నిరాహార దీక్షను మున్సిపల్ ఛైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. గత 17 రోజులుగా నేతన్నలు వారి సమస్యలు తీర్చాలంటూ చేస్తున్న దీక్ష ఉద్దేశాన్ని తాను తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
నేతన్నల రిలే నిరాహార దీక్ష విరమణ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్త
లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని తమను ఆదుకోవాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కాగా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్పర్సన్ సావిత్రి మేఘారెడ్డి వారిచేత దీక్షను విరమింపజేశారు.
నేతన్నల రిలే నిరాహార దీక్ష విరమణ
కరోనా కాలంలో చేనేత కార్మికులు చాలా ఇబ్బందు పడుతున్నారని వారి సమస్యల పరిష్కారం దిశగా తాను కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్