యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలోని సాధన మానసిక వికలాంగుల కేంద్రంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. హైదరాబాద్కి చెందిన గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ప్రతినిధులు గ్రామంలోని 400 మంది నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, మాస్కులు అందజేశారు. ఇప్పటికే 15 వేలకు పైగా నిత్యావసర కిట్లను వివిధ జిల్లాలోని ప్రజలకు అందజేశామని ట్రస్ట్ ఛైర్మన్ ధనలక్ష్మి తెలిపారు.
400 మంది నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ వేళ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారంలో ఉంటున్న 400 మంది నిరుపేద కుటుంబాలకు గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
400 మంది నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ
ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని... భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి చూపించేలా ట్రస్ట్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గత 15 ఏళ్లుగా ట్రస్ట్ తరుఫున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, సాధన మానసిక వికలాంగుల కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.