పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రతి సమస్య పరిష్కారం కోసం పోరాడుతానని యువ తెలంగాణ పార్టీ వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రైవేటు టీచర్ల సమక్షంలో మాట-ముచ్చట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఒక్క అవకాశం ఇస్తే... శాసన మండలిలో పోరాడుతా: రాణి రుద్రమ - తెలంగాణ వార్తలు
చౌటుప్పల్ మండల కేంద్రంలో ప్రైవేటు టీచర్ల సమక్షంలో మాట-ముచ్చట కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ పాల్గొన్నారు. ఒక్క అవకాశం ఇస్తే మండలిలో పోరాడుతానని అన్నారు. కరోనా సమయంలో ఆరు లక్షల మంది పట్టభద్రులను ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని విమర్శించారు.
ఒక్క అవకాశం ఇస్తే... శాసన మండలిలో పోరాడుతా: రాణి రుద్రమ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓట్లు అడగడానికి అనర్హులని ఆమె అన్నారు. కరోనా సమయంలో ఆరు లక్షల మంది పట్టభద్రులను ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని అభిప్రాయపడ్డారు. తనకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, పలు ప్రైవేటు విద్యా సంస్థల టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ముద్రా రుణాల్లో తెలంగాణకు అన్యాయం: వినోద్