తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వస్థలానికి మృతదేహం - అమెరికాలో యాదాద్రి వాసి మృతి

ఈనెల 19న అమెరికాలో మరణించిన కొత్త గోవర్ధన్​రెడ్డి మృతదేహం స్వస్థలమైన యాదాద్రి భువనగిరి జిల్లా రహీంఖాన్​పేటకు చేరుకుంది.

యాదాద్రి జిల్లా

By

Published : Feb 28, 2019, 11:59 PM IST

ఈనెల 19న అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన తెలంగాణకు చెందిన కొత్త గోవర్ధన్​ రెడ్డి మృతదేహం స్వదేశానికి చేరుకుంది. ఈ ఉదయం హైదరాబాద్​కు చేరుకున్న మృతదేహాన్ని.. గోవర్ధన్​ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రహీంఖాన్​పేటకు అధికారులు తరలించారు.
గోవర్ధన్​రెడ్డి అమెరికాలోని ఓ డిపార్ట్​మెంటల్​ స్టోర్​లో మేనేజర్​గా పనిచేస్తున్నాడు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈనెల 19న రాత్రి 8.30 గంటలకు స్టోర్​లోకి చొరబడి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గోవర్ధన్​ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. మృతుని స్వగ్రామం రహీంఖాన్​పేటలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవీ చూడండి :ఎన్​కౌంటర్ చేయకండి

స్వస్థలానికి చేరుకున్న మృతదేహం

ABOUT THE AUTHOR

...view details