తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి గుమ్మానికి గొర్రె కళేబరం - dog

యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంలో గొర్రెలను కుక్క కొరికి చంపేస్తోంది. ఆగ్రహించిన రైతులు కుక్క యజమాని ఇంటి గుమ్మానికి ఆ గొర్రె  కళేబరాన్ని వేలాడదీసి నిరసన తెలిపారు.

ఇంటి గుమ్మానికి గొర్రె కళేబరం

By

Published : May 26, 2019, 12:39 PM IST

Updated : May 26, 2019, 12:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక సంఘం పరిధిలోని ఆరెగూడెంలో గత కొన్ని రోజులుగా ఓ శునకం వల్ల గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. గజ్జి మల్లేశానికి చెందిన ఓ గొర్రె, రెండు పిల్లలను బుచ్చమ్మ పెంపుడు కుక్క కొరికి చంపింది. ఇటీవల ఇంకొంతమంది రైతుల గొర్రెలను కూడా చంపడం వల్ల ఆగ్రహించిన గొర్రెల కాపరులు చనిపోయిన గొర్రెను బుచ్చమ్మ ఇంటి గుమ్మానికి వేలాడదీసి నిరసన తెలిపారు. ఆ సమయంలో బుచ్చమ్మ ఇంటికి తాళం వేసి ఉంది.

ఇంటి గుమ్మానికి గొర్రె కళేబరం
Last Updated : May 26, 2019, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details