yadadri temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి యాదాద్రి దేవస్థానంలో జరిగే మహా కుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా జరిపే మహాయాగం అంకురార్పణ పూజా సమయానికి గోదావరి జలాలు గలగలమంటూ గండిచెరువులోకి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్వం సిద్ధమైంది.
మహాకుంభ సంప్రోక్షణ వేడుకల వరకు
ఈ నెల 21 నుంచి యాదాద్రి దేవస్థానంలో జరిగే మహాకుంభ సంప్రోక్షణ వేడుకల్లో భాగంగా జరిపే మహాయాగం అంకురార్పణ పూజా సమయానికి గోదావరి జలాలు గలగలమంటూ గండిచెరువులోకి దూకనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ జలాలు కొమరవెల్లి మల్లన్న సాగర్‌కు చేరగా, అక్కడి నుంచి నృసింహ సాగర్(బస్వాపూర్) జలాశయానికి కాల్వకు ద్వారా చేరుతాయి. ఈ జలాశయానికి ఐదు కిలోమీటర్ల ముందే యాదగిరిగుట్ట మండలంలోని జంగపల్లి వద్ద కాల్వ నుంచి యాదాద్రికి గోదావరి జలాలు మళ్లుతాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో గండి చెరువు వైపు నీటిని మళ్లింపు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.