యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం గోవిందాపురంలో శిథిలావస్థకు చేరుకున్న కనిక్క మాతా చర్చి పునర్నిర్మాణ పనులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ప్రారంభించారు. తన వంతు సహాయంగా లక్ష రూపాయల విరాళం అందించారు. తెలంగాణ ప్రభుత్వం మత సామరస్యానికి ప్రతీక అని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క మత ఘర్షణ కూడా జరగకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. చర్చి నిర్మాణానికి అందరూ సహకరించాలని, అప్పుడే పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఫాదర్ మాదాను ఫ్రాన్సిస్, జైపాల్ గ్రగోరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
చర్చి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ - యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న కనిక్క మాతా చర్చి పునర్నిర్మాణ పనులను తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిశోర్ ప్రారంభించారు.
చర్చి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గాదరి కిశోర్