యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామ శివారులో వ్యవసాయ బావుల వద్ద మంటలు చెలరేగాయి. యాదయ్య, శీనయ్య, శంకరయ్యకు చెందిన గుడిసెలు దగ్ధమయ్యాయి. వ్యవసాయ సామాగ్రితో పాటు పత్తి, కంది చేను కాలిబూడిదయ్యాయి.
గుడిసెలు దగ్ధం.. కాలిపోయిన పంట - యాదాద్రి జిల్లా శేరుగూడెంలో గుడిసెలు దగ్ధం
యాదాద్రి జిల్లా శేరిగూడెం గ్రామ శివారులో గుడిసెలు దగ్ధమయ్యాయి. వీటితో పాటు వ్వవసాయ సామాగ్రి, పత్తి, కంది చేను కూడా మంటల్లో బూడిదయ్యాయి. సుమారు లక్ష నష్టం వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గుడిసెలు దగ్ధం.. కాలిపోయిన పంట
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి