యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సయ్య గూడెం వద్ద ఉన్న ఎస్టీఎల్ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చూస్తూండగానే మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గంట పాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు.
పత్తి మిల్లులో అగ్నిప్రమాదం... లక్షల్లో నష్టం - FIRE ACCIDENT NEWS IN YADADRI BHUVANAGIRI DISTRICT
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ఎస్టీఎల్ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. గంట పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది... మంటలకు ఆర్పారు.
FIRE ACCIDENT IN COTTON MILL AT NARSAIHGUDEM
ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మిల్లు లోపలున్న పత్తి మొత్తం దగ్ధమైంది. బయట ఉన్న పత్తికి మంటలంటుకోకుండా మిల్లు సిబ్బంది అప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని మిల్లు సిబ్బంది అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.