తెలంగాణ

telangana

ETV Bharat / state

కందుల డబ్బుల కోసం రైతు ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కందుల డబ్బలు బ్యాంకులో జమ కాలేదని సింగిల్​విండో కార్యాలయంలో పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన దిగారు. రెండ్రోజుల్లో తప్పకుండా డబ్బులు జమచేస్తామని చెప్పడం వల్ల ఆందోళన విరమించి ఇంటికి వెళ్లారు.

Farmer  suicide attempt at mothukuru in Yadadri district
కందుల డబ్బుల కోసం రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 21, 2020, 6:23 AM IST

నాలుగు నెలులు గడిచినా కందుల బిల్లు చేతికందకపోవటం వల్ల రైతు పురుగుమందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటానని మోత్కూరు సింగిల్​విండో కార్యాలయంలో ఆందోళనకు దిగారు. స్థానిక రైతు బద్దం సత్తిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో మోత్కూరు సింగిల్​ విండో కొనుగోలు కేంద్రంలో 36 బస్తాలు కందులను విక్రయించగా... అతడికి రూ.1.04లక్షల రావాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం అనేక సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అతడి ఖాతాలో పడలేదని వాపోయారు.

ప్రస్తుతం సాగుకు పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కార్యాలయానికి వచ్చి అధికారులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలిపారు. సీఈఓ కృష్ణమాచారి జోక్యం చేసుకొని రెండ్రోజుల్లో తప్పకుండా డబ్బులు జమచేస్తామని చెప్పడం వల్ల రైతు సత్తిరెడ్డి ఇంటికి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details