తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి రైతు మృతి' - YADAGIRI GUTTA

ఆకస్మికంగా కురిసిన వర్షం యాదగిరిగుట్టలో భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి రైతు గొర్రె శ్రీనివాస్ దాతరుపల్లి గ్రామంలోని కోళ్ల ఫారంలోనికి వెళ్లగా ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

By

Published : Jun 6, 2019, 9:44 PM IST

యాదాద్రి భూవనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి గొల్ల గుడిసెలులో నిరుపయోగంగా ఉన్న పాత కోళ్లఫారం షెడ్డు కూలింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోందని కోళ్ల ఫారం షెడ్డులోకి వెళ్లిన గొల్లగూడెం గ్రామానికి చెందిన గొర్రె శ్రీనివాస్ అనే రైతుపై ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని యాదగిరిగుట్ట సీఐ నర్సింగరావు పేర్కొన్నారు.

ప్రమాదవశాత్తు షెడ్డు గోడ కూలి అక్కడికక్కడే రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details