మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు మెుదటిసారిగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో మంత్రిని తెరాస కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు . గ్రామ పంచాయతీ భవనాలు లేని చోట్ల భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
యాదాద్రిలో ఎర్రబెల్లి పర్యటన - dayakar
తెలంగాణలో పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు.
యాదాద్రి జిల్లాలో పర్యటించిన మంత్రి
ప్రతి గ్రామ పంచాయతీలో స్మశానవాటిక, గోదాంలు, ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'జీవన్‌రెడ్డి నామినేషన్..'