తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయానికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతంటే? - యాదాద్రికి పోటెత్తిన జనసందోహం

Record Income in Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఇవాళ ఒక్కరోజే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 సమకూరింది. మరోవైపు స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

Yadadri Sri Lakshmi Narasimhaswamy Temple
Yadadri Sri Lakshmi Narasimhaswamy Temple

By

Published : Nov 20, 2022, 1:23 PM IST

Updated : Nov 20, 2022, 10:21 PM IST

Record Income in Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. ఇవాళ ఒక్కరోజే వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. గత ఆదివారం నాటి రికార్డును ఈరోజు ఆదాయం బ్రేక్ చేసింది. కార్తీక మాసం చివరి వారం కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

స్వామి వారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కల్యాణ కట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు.. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది.

భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన.. ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, విష్ణుపుష్కరిణి, కొండ కింద వ్రత మండపం నిర్వహించారు. లక్ష్మీపుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

మరోసారి రికార్డు స్థాయి ఆదాయం:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం వివిధ కైంకర్యాల ద్వారా రూ.1,16,13,977ల ఆదాయం లభించిందని ఆలయ ఈవో తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.3,24,650, కైంకర్యాలు రూ.16,100, సుప్రభాతం రూ.10,300, వ్రతాలు రూ.15,20,000, ప్రచారశాఖ రూ.2,87,500, వీఐపీ దర్శనం రూ.18,90,000, యాదరుషి నిలయం రూ.1,92,500, ప్రసాద విక్రయం ద్వారా రూ.44,37,150, పాతగుట్ట రూ.3,78,670, కళ్యాణ కట్ట రూ.1,78,000, శాశ్వత పూజలు రూ.37,500, వాహన పూజలు రూ.31,200, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.9,75,000, సువర్ణ పుష్పార్చన రూ.2,52,348, వేద ఆశీర్వచనం రూ.19,800, శివాలయం రూ.32,600, అన్నదానము రూ.55,659, బ్రేక్‌దర్శనం టికెట్ల విక్రయం ద్వారా రూ.9,75,000లు ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌:స్వామి వారిని దర్శించుకున్న భక్తులు సాయంత్రం ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో జాతీయ రహదారి 163పై వరంగల్‌-హైదరాబాద్‌ మార్గంలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. యాదాద్రికి వెళ్లిన వాహనాలకు తోడు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు ఒక్కసారిగా టోల్‌ప్లాజాకు చేరుకోవడంతో అరకిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. టోల్‌ప్లాజా మేనేజర్‌ సుధీర్‌ తన సిబ్బందితో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నించారు. టోల్‌ ప్లాజాలో 13కౌంటర్లు ఉండగా 9 కౌంటర్లు వరంగల్‌-హైదరాబాద్‌ మార్గం వైపు కేటాయించి రద్దీని నియంత్రించారు.

యాదాద్రి ఆలయానికి మరోసారి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతంటే?

ఇవీ చదవండి:రికార్డు స్థాయిలో షిరిడీకి కానుకల సమర్పణ.. తిరుపతి తర్వాత అంత మొత్తంలో..

'104' నాటౌట్.. ఘనంగా రెండో ప్రపంచ యుద్ధవీరుడి బర్త్​డే.. ఇప్పటికీ అదే జోష్!

Last Updated : Nov 20, 2022, 10:21 PM IST

ABOUT THE AUTHOR

...view details