యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడం వల్ల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ ఏర్పాటు చేశారు.
యాదాద్రికి పొటెత్తిన భక్తులు.. దర్శనానికి గంట సమయం - Yadadri devotees in temple
ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడం వల్ల భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రిలో పొటెత్తిన భక్తులు
ఆలయ అధికారులు కొవిడ్ నిబంధనల కారణంగా కేవలం భక్తులను స్వామి వారి దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆర్జిత సేవలు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్నపటికీ... ఆలయంలోకి వెళ్లే క్యూలైన్ వద్ద ప్రసాదాల విక్రయశాల వద్ద భక్తులు భౌతిక దూరం పాటించడం లేదు. ఆలయ అధికారులు కూడా నిబంధనలు పట్టించుకోవడం లేదు.