యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కల్యాణ కట్ట, ప్రసాదాల విక్రయశాల, కొండపైన, సత్యనారాయణ స్వామి వ్రత పూజలు జరిగే ప్రాంతాల్లో.. ఇలా ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది.
యాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ - ధర్మ దర్శనం
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామిని దర్శిచుకుంటున్నారు.
యాదాద్రి సన్నిధిలో భక్తుల రద్దీ
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా.. ఆలయ నిర్వాహకులు భక్తులకు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. ధర్మ దర్శనానికి 2గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. దీంతో.. భక్తులు ఆటో, ఆర్టీసీ బస్సుల్లో, కాలినడకన కొండమీదికి వెళ్తున్నారు.
ఇదీ చదవండి:ఘనంగా మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవ వేడుక