యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇత్తడి దర్శన వరుసలపై పైకప్పు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దర్శన వరుసల సముదాయం నుంచి ప్రధాన ఆలయం మధ్య దూరం సుమారు రెండు వందల మీటర్ల వరకు ఉంటుంది. స్వామి దర్శనం కోసం యాత్రికులు వరుసల్లో నిల్చున్న సమయంలో ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ఇత్తడి దర్శన వరుసలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రిలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 3 కోట్లతో స్వామి వారి మెట్ల నిర్మాణం తిరుమల తరహాలో చేపడుతున్నారు. అభివృద్ధిలో భాగంగా దర్శన వరుసల్లో ఇత్తడి పైకప్పు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి.
యాదాద్రిలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు
ప్రధానాలయ గోపురాలపై ఏర్పాటు చేసే 10 రాగి కలశాలు ఆలయానికి చేరాయి. ఆలయ పునః ప్రారంభం సమయంలో సంప్రోక్షణ చేసి రాజ గోపురాలపై ప్రతిష్ఠిస్తామని అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు వీటిని దేవస్థానంలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:బుల్లితెరపై రాణించి వెండితెరపై అదరగొట్టి!