యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని కొండ మడుగులో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో మూడు గంటల పాటు గ్రామంలోని ప్రతి ఇంటిలో సోదాలు జరిపారు. వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్టు పోలీసు వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాలు లేని 49 ద్విచక్రవాహనాలు, 9 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని, ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుకున్నట్టు డీసీపీ నారాయణరెడ్డి తెలియజేశారు.
'ప్రజల్లో ధైర్యం నింపేందుకే నిర్బంధ తనిఖీలు' - నిర్బంధ తనిఖీలు
వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా , నేరాలను అదుపు చేయడానికి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
'ప్రజలలో ధైర్యం నింపేందుకే నిర్బంధ తనిఖీలు'