యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడటానికే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. నూతన వాహన చట్టం అమలులోకి వస్తే అపరాద రుసుములు పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి వాహనదారులు సకాలంలో వాహన ధ్రువపత్రాలు సరిచేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా శిరస్త్రాణం ధరించాలని తెలిపారు.
శాంతి భద్రతలు కాపాడటానికే నిర్బంధ తనిఖీలు: డీసీపీ
యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
శాంతి భద్రతలు కాపాడటానికే నిర్బంధ తనిఖీలు: డీసీపీ