రోడ్డు పనుల కోసం చెరువులో మట్టిని తీస్తున్నారని... నీరు ఎలా నిల్వ ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం ధర్మారం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారం నుంచి గట్టుసింగారం, ధర్మారం నుంచి కోటమర్తి గ్రామాల లింకురోడ్లకు మంజూరైన ఫార్మేషన్ పనుల కోసం సుమారు నాలుగు నుంచి ఐదు అడుగుల లోతులో గుత్తేదారు మట్టిని తవ్వి రోడ్ల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు.
'రోడ్డు పనుల కోసం మట్టి తీస్తున్నారు.. నీరు ఎలా నిల్వ ఉంటుంది?' - తెలంగాణ వార్తలు
రోడ్డు పనుల కోసం చెరువులో మట్టిని తీస్తున్నారని... మొరం తేలితే నీరు నిల్వ ఉండదని యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మారం గ్రామస్థులు వాపోయారు. ఫార్మేషన్ రోడ్డు పనుల కోసం అనుమతులు లేకున్నా మట్టి తీస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
చెరువు మట్టి తవ్వకాలు, రోడ్డు కోసం అక్రమంగా మట్టి తవ్వకం
జేసీబీ సాయంతో చెరువులో మట్టి తీయడం వల్ల మొరం తేలి... నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:'రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే బ్లాక్ ఫంగస్ ముప్పు'